News October 6, 2025
పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు 22 మెడల్స్

ఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ముగిశాయి. భారత్ 22 పతకాలను (6 గోల్డ్, 9 సిల్వర్, 7 బ్రాంజ్) గెలుచుకుంది. పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా ఈ ఛాంపియన్‌షిప్‌లో 100కు పైగా దేశాల నుంచి 2,200 మందికి పైగా అథ్లెట్లు పోటీ పడ్డారు. ఖతార్, UAE, జపాన్ తర్వాత వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన నాలుగో ఆసియా దేశంగా IND నిలిచింది.
Similar News
News October 6, 2025
హమాస్‌తో సానుకూల చర్చలు జరిగాయి: ట్రంప్

హమాస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో వీకెండ్‌లో సానుకూల చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘మిడిల్ ఈస్ట్‌లో శాంతి స్థాపన, గాజాలో యుద్ధం ముగింపు, బందీల విడుదలపై జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. ఈజిప్టులో ఇవాళ మరోసారి చర్చలు జరుగుతాయి. ఈ వారంలో ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. దీనిని వేగంగా పూర్తి చేయాలని చెప్పా. సమయం చాలా విలువైంది. లేదంటే భారీ రక్తపాతం జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
News October 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. కాంగ్రెస్ టికెట్ దక్కేదెవరికి?

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీకి పీసీసీ ముగ్గురి పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, CN రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరు ఉపఎన్నిక బరిలో నిలుస్తారో చూడాలి.
News October 6, 2025
శివుణ్ని ఏ సమయంలో దర్శించుకోవాలి?

పరమేశ్వరుని ఆలయానికి సాయంత్రం వెళ్లడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ సమయంలో శివ లింగాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందని అంటున్నారు. రోజు పూర్తయ్యే సమయంలో ఆ లయకారుణ్ని దర్శించుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి తొందరపాటు లేకుండా, ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు. <<-se>>#DharmaSandehalu<<>>