News September 27, 2025

ఢిల్లీలో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్.. పాక్ దూరం

image

నేటి నుంచి ఢిల్లీ వేదికగా జరగనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి పాక్ తప్పుకుంది. అందుకు భారత్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సాకులు చెప్పడం గమనార్హం. ఇక వచ్చేనెల 5వరకు జరిగే ఈ పోటీల్లో 100 దేశాల నుంచి 1500 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. IND నుంచి 76 మంది పోటీలో ఉన్నారు. 400M రేసులో TG నుంచి దీప్తి జీవాంజి, బానోతు అకీరానందన్, షాట్‌పుట్‌లో AP నుంచి రొంగలి రవి బరిలో ఉన్నారు.

Similar News

News February 8, 2026

ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

image

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం

News February 8, 2026

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

image

యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా T20IWCలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 9 మ్యాచులు గెలిచింది. దీంతో సౌతాఫ్రికా(2024లో 8విజయాలు)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(8wins) ఉంది. అటు WCలో వన్డే, టీ20ల్లో కలిపి ఓవరాల్‌గా టీమ్ ఇండియా 100 విజయాలు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా(108) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ కావడం గమనార్హం.

News February 8, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.