News March 29, 2024
పరాగ్ ఆడుతున్నాడు.. నువ్వెప్పుడు సమద్?

నిన్న రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రియాగ్ పరాన్ 84 రన్స్(45 బంతుల్లో)తో రాణించిన సంగతి తెలిసిందే. చాలా సీజన్లుగా అతడు అంచనాలకు తగ్గట్లుగా ఆడకపోయినా రాజస్థాన్ నమ్మకం ఉంచింది. సన్‌రైజర్స్ కూడా అదే తరహాలో అబ్దుల్ సమద్‌ను జట్టులో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఒకట్రెండు మ్యాచులు తప్ప ఆడలేదు. దీంతో నువ్వెప్పుడు అలా ఆడతావ్ అంటూ నెట్టింట SRH ఫ్యాన్స్ సమద్‌ను ప్రశ్నిస్తున్నారు.
Similar News
News February 4, 2026
భువనగిరి: పులి పంజా.. మరో ఆవును చంపేసింది

ఆలేరు మండలం సారాజిపేటలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఉప సర్పంచ్ దూడల శ్రీధర్‌కు చెందిన ఆవుపై బావి వద్ద పులి దాడి చేసి చంపేసింది. ఆవు మెడను కొరికి రక్తం తాగిన ఆనవాళ్లు చూసి గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో పులి వరుసగా పశువులపై దాడులు చేస్తోంది. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించి తమను, పశువులను కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.
News February 4, 2026
అన్‌బ్రాండెడ్ పొగాకు ఉత్పత్తులపై జీరో ట్యాక్స్.. ఏపీ మద్దతు

AP: ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గించడాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. ఈ మేరకు FEB 1 నుంచే దీన్ని అమలుచేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజిట్‌కు మద్దతిచ్చారు. ఇది రాష్ట్రంలో అన్ బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి, రైతులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఈ నోటిఫికేషన్‌ను దేశవ్యాప్తంగా ఒకేలా అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
News February 4, 2026
2007-2026.. బ్రెండన్ టేలర్ సరికొత్త చరిత్ర

రానున్న T20WCలో జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. మొట్టమొదటి T20WC(2007)లో ఆడిన టేలర్ 2026లోనూ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొంటున్న తొలి క్రికెటర్‌గా నిలవనున్నారు. టేలర్ 2015లో రిటైరై మళ్లీ 2017 నుంచి రెగ్యులర్‌గా క్రికెట్ ఆడుతున్నారు. ఈయన 58 T20Iలో 1,185 రన్స్, 207 వన్డేలలో 6,704 పరుగులు చేశారు. 2004లో క్రికెట్‌లోకి అడుగుపెట్టి 22 ఏళ్లుగా ఆడుతుండటం విశేషం.


