News October 16, 2024
MI బౌలింగ్ కోచ్గా పరాస్ మాంబ్రే
ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్గా పరాస్ మాంబ్రే నియమితులయ్యారు. MI హెడ్ కోచ్ జయవర్దనే నేతృత్వంలో మలింగతో పాటు ఈయన బౌలింగ్ బాధ్యతలు చూసుకుంటారు. ముంబైకి చెందిన ఈ మాజీ పేస్ బౌలర్ 2024 టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియా కోచింగ్ స్టాఫ్లో సభ్యుడిగా ఉన్నారు. ఈయన భారత్ తరఫున 2 టెస్టులు, 3 వన్డేలు ఆడారు.
Similar News
News January 3, 2025
మళ్లీ లాక్డౌన్ రానుందా?
ఐదేళ్ల తర్వాత కరోనా లాంటి మరో మహమ్మారి చైనాను వణికిస్తోంది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన <<15048897>>HMPV<<>> (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2019 DEC31న చైనాలో కరోనా తొలి కేసును గుర్తించగా ఊహించని విధంగా 3 నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రభుత్వాలు అలర్ట్ అవ్వాలని, లేకపోతే మళ్లీ లాక్డౌన్ రోజులు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News January 3, 2025
భారత్కు బిగ్ షాక్.. ఒకే ఓవర్లో 2 వికెట్లు
టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. బోలాండ్ వేసిన ఓవర్లో రిషభ్ పంత్, నితీశ్ కుమార్ ఔట్ అయ్యారు. ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జడేజాతో కలిసి పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పంత్ 40 పరుగులు చేసి ఔట్ కాగా, క్రీజులోకి వచ్చిన నితీశ్ గోల్డెన్ డక్ అయ్యారు. దీంతో టీమ్ఇండియా 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
News January 3, 2025
విజయ నెయ్యి మాత్రమే వాడాలి: ప్రభుత్వం
తెలంగాణలోని అన్ని ఆలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నెయ్యి మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ డైయిరీతో ఒప్పందం చేసుకున్న భద్రాద్రి ఆలయ అధికారులపై చర్యలు తీసుకుంది. అన్ని ఆలయాల్లో నెయ్యి సరఫరాపై నివేదిక ఇవ్వాలని, ఇతర డెయిరీలతో ఒప్పందాలు చేసుకుని ఉంటే రద్దు చేసుకోవాలని సూచించింది. యాదాద్రిలో మాత్రం మార్చి వరకు మదర్ డెయిరీ నెయ్యి వాడేందుకు అనుమతి ఇచ్చింది.