News April 13, 2024
ఇంటర్ ఫీజులతో పేరెంట్స్ ఉక్కిరిబిక్కిరి
TG: రాష్ట్రంలో ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఫీజులు రెట్టింపయ్యాయి. కార్పొరేట్ కాలేజీలు డేస్కాలర్‌కు రూ.2.25లక్షలు విధిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ గతేడాది రూ.40వేలు ఉండగా.. రూ.70వేలకు చేరింది. దీంతో పిల్లలను చదివించేదెలాగని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. నిర్వహణ ఖర్చు, లెక్చరర్ల జీతాలు పెరగడంతో ఫీజులు పెంచాల్సి వస్తోందని యాజమాన్యాలు అంటున్నాయి.
Similar News
News November 16, 2024
చిన్నాన్నతో అనుబంధం మరువలేనిది: లోకేశ్
AP: తన చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడి మృతితో మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. చిన్నాన్నతో చిన్నప్పటి అనుబంధం కళ్ల ముందే మెదలాడుతోందన్నారు. ‘ఇన్నాళ్లు ఆయన కంటికి కనిపించే ధైర్యం. కానీ ఇకపై చిరకాల జ్ఞాపకం. అంతులేని దుఖంలో ఉన్న పిన్ని, తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలి. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
News November 16, 2024
వ్యాక్సిన్ల వ్యతిరేకికి వైద్యశాఖ.. ఫార్మా కంపెనీలకు ప్రతికూలమే!
వ్యాక్సిన్లకు బద్దవ్యతిరేకి అయిన రాబర్ట్ ఎఫ్ కెనెడీను US ఆరోగ్య మంత్రిగా ట్రంప్ నామినేట్ చేయడం భారత ఫార్మా సంస్థలపై ప్రభావం చూపవచ్చని తెలుస్తోంది. 2023-24లో విదేశీ ఎగుమతుల్లో అమెరికాకు భారత్ 31% మందులు సరఫరా చేసింది. 2024-25లో US$ 7.2 బిలియన్ల విలువైన మందులను విదేశాలకు భారత్ ఎగుమతి చేసింది. కెనడీ రాక భారత్ సహా ఇతర దేశాల సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.
News November 16, 2024
AP అసెంబ్లీ న్యూస్ రౌండప్
* టిడ్కో ఇళ్ల అక్రమాలపై విచారణ జరిపించాలి: MLAలు
* 2019కల్లా 313832 ఇళ్లు 90శాతం పూర్తి: GV ఆంజనేయులు
* టిడ్కో ఇళ్లను YCP నేతలు అమ్ముకున్నారు: పల్లా
* సోషల్ మీడియా సైకోలను శిక్షించాలి: గౌతు శిరీష
* తుంగభద్ర గేట్లు మార్చేందుకు నిధులు కేటాయించాలి: కాలవ శ్రీనివాసులు
* మల్లవల్లి పారిశ్రామిక వాడకు భూములు కేటాయించాలి: యార్లగడ్డ
* వెలిగొండపై YCP సినిమా స్టైల్ ప్రచారం: ఉగ్ర నరసింహారెడ్డి