News December 25, 2024

కొడుకు హిజ్రాను ప్రేమించాడని పేరెంట్స్ ఆత్మహత్య

image

AP: హిజ్రాతో కొడుకు ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలిసి తల్లిదండ్రులు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నంద్యాలలో జరిగింది. సుబ్బరాయుడు, సరస్వతి దంపతుల కొడుకు సునీల్ బీటెక్ ఫస్టియర్ ఫెయిలై ఆటో డ్రైవర్లతో తిరుగుతున్నాడు. ఈక్రమంలోనే ఓ హిజ్రాతో చనువుగా ఉంటున్నాడని పేరెంట్స్ అతడిని మందలించారు. హిజ్రా గ్యాంగ్ వారి షాపునకు వచ్చి బూతులు తిడుతూ హంగామా చేశారు. దీంతో పురుగుమందు తాగి చనిపోయారు.

Similar News

News December 26, 2024

హైదరాబాద్ ప్రపంచ సినీ రాజధాని కావాలి: నాగార్జున

image

TG: ఈరోజు రేవంత్‌తో జరిగిన భేటీలో సినీ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి’ అని నాగార్జున అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. మరోవైపు సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఎన్నికల ఫలితాల్లాగే ఉత్కంఠగా ఉంటుందని మురళీమోహన్ తెలిపారు.

News December 26, 2024

సినీ పెద్దలకు సీఎం రేవంత్ షాక్

image

TG: మూవీ ఇండస్ట్రీకి కీలకమైన బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై సినీ ప్రముఖులకు నిరాశే ఎదురైంది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. CM నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు నిరాశ చెందినట్లు సమాచారం. రూ.వందల కోట్లతో తెరకెక్కిన సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోవడం పెద్ద దెబ్బేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News December 26, 2024

వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేం: సీఎం

image

TG: తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నారు. తనకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకరిస్తుందని, అదే సమయంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. చిత్ర పరిశ్రమ రాజకీయాలను దూరం పెట్టాలని సూచించారు.