News August 10, 2025
చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి

మట్టిలో ఆడటం, శుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లల శరీరంలో నులి పురుగులు ఏర్పడతాయి. 1-19 ఏళ్ల వరకు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మందులు వాడుతూ ఉండాలి. వీటివల్ల ఆకలి తగ్గడం, రక్తహీనత, కడుపులో నొప్పి, పోషకాహార లోపం, ఎదుగుదల తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు10న రెండుసార్లు ‘నులి పురుగుల నివారణ దినోత్సవాలు’ నిర్వహిస్తుంది. ఈ సందర్భాల్లో ఉచితంగానే మందులు పంపిణీ చేస్తోంది.
Similar News
News August 10, 2025
అల్పపీడనం.. 3 రోజులు అతిభారీ వర్షాలు

ఈనెల 13న పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 13,14,15 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే HYD సహా జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. అటు ఏపీలో అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ కోస్తా, రాయలసీమల్లోని పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.
News August 10, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. బిల్లు స్టేటస్ ఇలా తెలుసుకోండి!

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లో పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్‌ను అప్డేట్ చేసింది. బిల్లు ఎక్కడి వరకు వచ్చింది? ఏ కారణంతో ఆగిపోయింది? వంటి సమాచారాన్ని <
News August 10, 2025
కూలీ క్రేజ్.. సెలవు ప్రకటించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. దీంతో ఫస్ట్ డేనే తమ ఉద్యోగులు రజినీ సినిమా చూసేందుకు యూనో ఆక్వా కేర్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ సెలవు ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, మధురై, చెంగల్పట్టు, అరపాలయం, మట్టుతవానిల్లో ఉన్న అన్ని బ్రాంచీలకు సెలవు వర్తిస్తుందని సర్క్యులర్ పంపింది. తమ ఉద్యోగుల వినతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.