News February 15, 2025

పేరెంట్స్ సెక్స్ కామెంట్స్.. యూట్యూబర్ తరఫున వాదించేది ఎవరంటే?

image

‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో <<15413969>>వివాదాస్పద వ్యాఖ్యలతో<<>> కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ తనపై నమోదైన కేసులు కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన తరఫున వాదించేది మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కొడుకు అభినవ్ చంద్రచూడ్. బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అభినవ్ ముంబైలోనే లా పట్టా పొందారు. హార్వర్డ్ లా స్కూల్లో LLM చదివారు.

Similar News

News December 8, 2025

ఇంటర్వ్యూతో BELలో పోస్టులు

image

HYD-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌(<>BEL<<>>) గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. BE, B,Tech, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు DEC 9న ఉ. 9.30గం.- 11.30గం. వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ముందుగా https://nats.education.gov.in/ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫారమ్ ప్రింట్ ఇంటర్వ్యూకు తీసుకువెళ్లాలి. వెబ్‌సైట్: https://bel-india.in/

News December 8, 2025

T20WC.. ‘స్ట్రీమింగ్’ నుంచి తప్పుకున్న జియోహాట్‌స్టార్!

image

వచ్చే ఏడాది T20WC స్ట్రీమింగ్‌ బాధ్యతల నుంచి జియో హాట్‌స్టార్ తప్పుకున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. రెండేళ్ల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొనసాగలేమని ICCకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ రేసులోకి వచ్చినట్లు తెలిపింది. ఇదే నిజమైతే టోర్నీ వీక్షించడానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రేక్షకుల జేబుకు చిల్లు పడటం ఖాయం.

News December 8, 2025

అంజూ బాబీ జార్జ్‌.. ఎందరికో ఆదర్శం

image

మన దేశానికి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తొలి పతకం తెచ్చిన క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్. కేరళకు చెందిన అంజూ ఒక జన్యుపరమైన సమస్యతో ఒకే కిడ్నీతో జన్మించినా.. దాన్ని అధిగమించి ఎన్నో పతకాలు, అవార్డులు సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నుంచి వుమెన్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డ్ గెలుచుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.