News March 22, 2024

పారిస్ ఒలింపిక్స్.. అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్!

image

పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. అథ్లెట్లు శృంగారంలో పాల్గొనడంపై టోక్యో ఒలింపిక్స్‌లో అమలైన నిషేధాన్ని ఈసారి రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 14,250 మంది అథ్లెట్లకు 3లక్షల కండోమ్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అథ్లెట్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌ టైమ్‌లో కరోనా వ్యాప్తి కారణంగా శృంగారంపై నిషేధం అమలైంది.

Similar News

News September 16, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,11,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.1,02,600 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,44,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 16, 2025

డబ్బుల కోసం వేరే వ్యక్తితో బెడ్‌పై పడుకోలేను: తనుశ్రీ

image

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా బిగ్‌బాస్ షోపై సంచలన కామెంట్స్ చేశారు. గత 11 ఏళ్లగా తనకు షో నిర్వాహకులు ఆఫర్ ఇస్తున్నా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ‘ఈ ఏడాది రూ.1.65 కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను. రియాలిటీ షోలో మరో వ్యక్తితో ఒకే బెడ్‌పై పడుకోలేను. నేనంత చీప్ కాదు. అలాంటి ప్లేస్‌లో ఉండలేను. స్త్రీలు, పురుషులు ఒకే హాల్‌లో ఒకే బెడ్‌పై పడుకుంటారు. నేను అలాంటిదానిలా కనిపిస్తున్నానా?’ అని వ్యాఖ్యానించారు.

News September 16, 2025

అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే

image

ఏపీలో ఐకానిక్ <<17619158>>వంతెన<<>> నమూనాను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. 4 నమూనాలను వెబ్‌సైట్‌లో ఉంచగా అత్యధిక ఓటింగ్(14వేలకు పైగా ఓట్లు) వచ్చిన రెండో డిజైన్‌ను సెలక్ట్ చేశారు. రూ.2,500CR వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ వంతెన రాకతో హైదరాబాద్-అమరావతి మధ్య 35kmల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఈ నమూనాను కూచిపూడి నృత్యంలోని స్వస్తిక హస్త భంగిమ ఆధారంగా తీసుకున్నారు.