News July 26, 2024
పారిస్ ఒలింపిక్స్.. గూగుల్ స్పెషల్ డూడుల్

ప్రపంచంలో ఆదరణ పొందిన ఈవెంట్లను ఉద్దేశించి ఎప్పటికప్పుడూ గూగుల్ స్పెషల్ డూడుల్‌ను ప్రదర్శిస్తూ వస్తోంది. ఇవాళ పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా నదిలో ఈదుతున్న పక్షులతో కూడిన స్పెషల్ డూడుల్‌ను రూపొందించింది. చరిత్రలో తొలిసారి సెన్ నది వేదికగా ఈ ప్రారంభోత్సవం జరగనుంది. 6 కిలోమీటర్ల మేర పడవల్లో 205 దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహిస్తారు.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News April 6, 2026
దేశాభివృద్ధికి కట్టుబడిన పార్టీ BJP: చంద్రబాబు

AP: BJP 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా AP CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి కట్టుబడిన ఆ పార్టీ విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తోందన్నారు. కష్టకాలంలోనూ సమర్థమైన విధానాలతో దేశ రాజకీయాల్లో BJP తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు. అమరావతి నిర్మాణం సహా ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని BJP ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
News April 6, 2026
గుడ్‌న్యూస్.. రాష్ట్రం నుంచి మరో 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు

AP: దక్షిణాదిన కేంద్రం నిర్మించే 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్రం మీదుగా వెళ్లనున్నాయి. అమరావతి నుంచి గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట, శ్రీ సిటీ మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్.. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూరు, మండ్య మీదుగా మైసూరు-చెన్నై కారిడార్ ఏర్పాటు కానున్నాయి. తొలుత హైదరాబాద్-చెన్నై కారిడార్‌లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది.
News April 6, 2026
కాసేపట్లో భారీ వర్షం: APSDMA

AP: రాగల 3 గంటల్లో తూ.గో., ప.గో., ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 40-60KM వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే అల్లూరి, ఏలూరు, ప.గో., తదితర జిల్లాల్లో వానలు పడుతున్నాయి.


