News May 13, 2024
పారిస్ ఒలింపిక్స్: రెజ్లింగ్‌లో దేశం నుంచి ఒకే ఒక్కడు
పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి పురుష రెజ్లర్లలో ఒక్కరు మాత్రమే అర్హత సాధించారు. 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అమన్ సెహ్రావత్ పోటీ పడనున్నారు. మిగతా వారు క్వాలిఫయర్స్‌లో ఓటమితో ఈ పోటీలకు దూరమయ్యారు. 2004లో ఆరుగురు, 2008లో ముగ్గురు, 2012, 2016, 2020లో నలుగురు చొప్పున రెజ్లర్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఈసారి ఒక్కరే వెళ్తుండడంతో దేశంలో రెజ్లింగ్ భవితవ్యంపై క్రీడాభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News January 10, 2025
చైనాలో మంకీపాక్స్ కొత్త మ్యుటెంట్ కలకలం
ఇప్పటికే hMPVతో భయపెడుతున్న చైనా మరో బాంబ్ పేల్చింది. మంకీపాక్స్‌కు చెందిన కొత్త మ్యుటెంట్ డిటెక్ట్ అయిందని ప్రకటించింది. కాంగో నుంచి వచ్చిన వ్యక్తిలో దీన్ని గుర్తించామని, అతడి నుంచి మరో నలుగురికి ఇది సోకిందని చెప్పింది. కాగా గతేడాది కాంగోలో మంకీపాక్స్ విజృంభించడంతో WHO దాన్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. తాజాగా ఈ వైరస్ చైనాకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది.
News January 10, 2025
ఇవాళ వైకుంఠ ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు!
పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి, పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానాన్ని ముట్టరాదు. శారీరక సంబంధాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్ర పోరాదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేయాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను కోయొద్దు. ఇతరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు.
News January 10, 2025
నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో నిర్మాణ రంగం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం ప్రసంగించనున్నారు. ఉదయం 11గంటలకు చంద్రబాబు గుంటూరు వస్తారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.