News July 31, 2024
ప్రియుడితో పారిస్ టూర్.. బ్రెజిల్ అథ్లెట్పై వేటు

ఒలింపిక్స్లో మెడల్ కొట్టేందుకు అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. బ్రెజిల్కు చెందిన స్విమ్మర్ కరోలినా వియెరా మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరో అథ్లెట్ అయిన గాబ్రియేల్ శాంటోస్తో కలిసి పారిస్ అంతా విహరించి టోర్నీ సమయానికి తిరిగివచ్చారు. దీంతో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ ఆమెను స్వదేశానికి పంపించింది. సారీ చెప్పిన శాంటోస్కు ఆడే ఛాన్స్ ఇచ్చినప్పటికీ అతడు ఓడిపోయాడు.
Similar News
News November 11, 2025
అమరావతిలో MSK క్రికెట్ అకాడమీ

AP: అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి BCCI మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ భూమిపూజ నిర్వహించారు. పిచుకలపాలెం రెవెన్యూ పరిధిలో 12 ఎకరాల్లో ఈ అకాడమీ నిర్మిస్తున్నారు. ఇందులో క్రికెట్ గ్రౌండ్, ఇండోర్, అవుట్ డోర్ ట్రైనింగ్ జోన్స్, 400 మంది ప్లేయర్ల సామర్థ్యంతో ట్రైనింగ్ సెంటర్, 1000 మంది ఉండేలా స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్స్, జిమ్, ఫిజియోథెరపీ వంటి సదుపాయాలు ఉండనున్నాయి.
News November 11, 2025
డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.
News November 11, 2025
‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటే అర్థం తెలుసా?

ప్రతి మంత్రాన్ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని ముగిస్తుంటాం. అంటే సమస్త దుఃఖాల నుంచి విముక్తి ప్రసాదించమని ఈశ్వరుడిని వేడుకోవడం. ఇందులో మూడు సార్లు ‘శాంతిః’ అని పలకడం ద్వారా మానవులను పీడించే త్రివిధ తాపాల నుంచి ఉపశమనం కోరడం. ఈ మూడు రకాల బాధలను దాటినప్పుడే మనకు మోక్షం, శాంతి లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ☞ మరి ఆ మూడు రకాల తాపాలేంటి?, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


