News July 26, 2024
ParisOlympics: రేపు భారత్ షెడ్యూల్ ఇదే

పారిస్ ఒలింపిక్స్లో ఇండియా రేపటి నుంచి పతకాల వేట మొదలుపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12.30 నుంచి అర్ధరాత్రి 12.02 వరకు రోయింగ్, షూటింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, బాక్సింగ్లో భారత అథ్లెట్లు పోటీ పడనున్నారు. ఏ సమయంలో ఏ ఆటగాడు ఏ విభాగంలో పోటీపడబోతున్నారో పైన ఫొటోల్లో చూడొచ్చు. జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18, వయాకామ్ 18లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
<<-se>>#ParisOlympics<<>>
Similar News
News November 22, 2025
పైరసీతో చిన్న నిర్మాతలకు తీవ్ర నష్టం: బన్నీ వాస్

పైరసీ వల్ల ఎంతో మంది చిన్న సినిమాల నిర్మాతలు నష్టపోతున్నారని బన్నీ వాస్ అన్నారు. పైరసీ తప్పని, అలాంటి తప్పును కొందరు తమకు లాభం కలిగిందని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఏడాదిలో 10-15 సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుతున్నారని పేర్కొన్నారు. కానీ ఆ సినిమాలకే కాకుండా మిగతా చిత్రాలూ పైరసీకి గురవుతున్నాయని తెలిపారు. పైకి బాగానే కనిపిస్తున్నా ఆ నిర్మాతలు లోపల బాధ పడుతున్నారన్నారు.
News November 22, 2025
గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ముసాయిదా ISB ఖరారు

TG: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ISB) “తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్” ముసాయిదాను రూపొందించింది. ఐటీ, పరిశ్రమ, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, చిత్రపరిశ్రమల అభివృద్ధిపై ఇది రూపొందింది. 3 ట్రిలియన్ USD ఆర్థిక వ్యవస్థను సాధించడంతో పాటు మహిళ, రైతు, యువత సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అన్ని శాఖలతో చర్చించి ISB రూపొందించిన ఈ డాక్యుమెంట్ను DEC తొలివారంలో క్యాబినెట్ భేటీలో ఆమోదించనున్నారు.
News November 22, 2025
అరటిని ముంబై, కోల్కతా మార్కెట్లకు తరలించండి: సీఎం

AP: రాయలసీమలో పండిన అరటిని ముంబై, కోల్కతా లాంటి మార్కెట్లకు తరలించి విక్రయించాలని CM చంద్రబాబు ఆదేశించినట్లు CMO తెలిపింది. అరటి ధరలు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ట్వీట్ చేసింది. అరటి ధరలు, కొనుగోళ్లపై నిత్యం వ్యాపారులతో మాట్లాడాలని ఆదేశించినట్లు పేర్కొంది. మార్కెట్లకు అరటి లోడు రైల్వే వ్యాగన్లను పంపేందుకూ చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వివరించింది.


