News June 23, 2024
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

18వ లోక్సభ ఫస్ట్ సెషన్ రేపు ఉ.11 గంటలకు ప్రారంభం కానుంది. PM మోదీ, కేంద్ర మంత్రులతో సహా కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 280 మందితో ప్రొటెం స్పీకర్ మహతాబ్ రేపు ప్రమాణం చేయిస్తారు. ఎల్లుండి మిగతా 264 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ఏపీ ఎంపీలు రేపు, తెలంగాణ ఎంపీలు ఎల్లుండి ప్రమాణం చేస్తారు. ఈనెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుండగా, 27న రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Similar News
News January 3, 2026
శ్రీవారి సన్నిధిలో ‘అన్నమయ్య’ వేంకటేశ్వరుడు!

అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వర స్వామిగా నటించిన సుమన్ శ్రీవారిని దర్శించుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఇప్పటికీ వేంకన్నస్వామి అంటే సుమన్ ముఖమే గుర్తుకొస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమాలో సుమన్ అద్భుతంగా నటించారని గుర్తుచేస్తున్నారు. కాగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించిన సుమన్.. అన్నమయ్యలో శ్రీవారి పాత్ర దక్కినందుకు తన జన్మ ధన్యమైందన్నారు.
News January 3, 2026
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి?

సూర్యుడిని దర్శించుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత ఎడమ నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇవి పూర్తయ్యాక తిరిగి కుడివైపు నుంచి ఎడమవైపునకు రాహువు, కేతువులను స్మరిస్తూ మరో రెండు ప్రదక్షిణలు చేయాలి. చివరగా ఒక్కొక్క గ్రహం పేరు తలుచుకుంటూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఇలా శాస్త్రోక్తంగా నియమాలను పాటిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగి అశేషమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
News January 3, 2026
నేటి నుంచి TG TET

TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 20 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నిర్వహించనున్నారు. మొత్తం 97 ఎగ్జామ్ సెంటర్లలో 9 రోజులపాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఇన్ సర్వీస్ టీచర్లకూ టెట్ తప్పనిసరి చేయడంతో వారు కూడా పరీక్ష రాయనున్నారు. పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లున్నారు.


