News March 25, 2025
29న పార్లమెంట్ సమావేశాలు రద్దు

ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు లోక్సభ సచివాలయం ప్రకటించింది. గత వారం హోలీకి ముందు రోజు సెలవు ఇవ్వడంతో ఈ నెల 29న కార్యకలాపాలు నిర్వహించాలని తొలుత నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ పేర్కొంది. ఆ రోజు యథాతథంగా సెలవు ఉంటుందని తెలిపింది.
Similar News
News March 26, 2025
ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.
News March 26, 2025
మెగాస్టార్-అనిల్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిని వినోదభరితమైన చిత్రంగా రూపొందిస్తారని పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే చిరు ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకోగా, మే 9న విడుదల కానుంది. ఇక అనిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.
News March 26, 2025
టెన్త్ ఎగ్జామ్ సరిగా రాయలేదని..

TG: పది పరీక్ష సరిగా రాయలేదని తనువు చాలించిందో విద్యార్థిని. నల్గొండ(D) కట్టంగూర్కు చెందిన పూజిత భార్గవి(15) ప్రస్తుతం జరుగుతున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతోంది. సోమవారం జరిగిన ఇంగ్లిష్ ఎగ్జామ్ సరిగా రాయలేదని మనస్తాపానికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
* జీవితంలో ఎగ్జామ్ ఓ భాగం మాత్రమే. పరీక్షల్లో ఫెయిలైనా లైఫ్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారెందరో ఉన్నారు.