News November 25, 2024
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చించనున్నారు. సభలో చర్చించే అంశాలపై లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్ పర్సన్ ఆమోదం తర్వాతే పార్లమెంటులో చర్చ జరుగుతుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
Similar News
News January 15, 2026
KNR: సంక్రాంతి, మేడారం ఎఫెక్ట్.. మేకలకు భలే గిరాకీ!

సంక్రాంతి, మేడారం జాతర సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేకలు, గొర్రెలకు భారీగా డిమాండ్ పెరిగింది. గురువారం మంథనిలోని ఫ్లైఓవర్ వంతెన సమీపంలో వ్యాపారులు మేకల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వ్యాపారులు అధిక రేట్లు వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. మరోవైపు, ప్రధాన రహదారిపైనే విక్రయాలు జరగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు చెబుతున్నారు.
News January 15, 2026
బంగ్లా క్రికెట్లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.
News January 15, 2026
MOIL లిమిటెడ్లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

<


