News March 10, 2025
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్, వక్ఫ్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. మణిపుర్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం లోక్సభ ఆమోదం కోరే అవకాశముంది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
Similar News
News March 10, 2025
భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.
News March 10, 2025
గోపీచంద్-సంకల్ప్ రెడ్డి కాంబోలో కొత్త మూవీ

టాలీవుడ్ హీరో గోపీచంద్ కొత్త సినిమాపై అప్డేట్ వచ్చింది. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ‘Gopichand33’ తెరకెక్కనున్నట్లు మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా, గతేడాది రిలీజైన గోపీచంద్-కావ్యా థాపర్ జంటగా నటించిన ‘విశ్వం’ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సంకల్ప్ రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం సినిమాలను తెరకెక్కించారు.
News March 10, 2025
ఏసీ ధరలు పెరిగే అవకాశం

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏసీలకు గిరాకీ పెరుగుతుందని పలు కంపెనీలు అంచనా వేశాయి. ఎండ తీవ్రత పెరిగి, 25-30% వరకు అధికంగా అమ్మకాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఏసీ కంపెనీలు వాటి తయారీ పెంచుతున్నాయి. అయితే ఇందుకు తగ్గట్లు విడిభాగాలు సరఫరా కావడం లేదు. దీంతో ఏసీల ధరలు 4-5% పెరగొచ్చని తెలుస్తోంది. రకాన్ని బట్టి ఒక్కో ఏసీపై రూ.1500 నుంచి రూ.2000 వరకు పెరిగే ఆస్కారం ఉంది.