News November 24, 2024
రేపటి నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా 15 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిపై చర్చించి ఆమోదించనుంది. సమావేశాల నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ జరగనుంది. మరోవైపు పార్లమెంట్ పాత భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
Similar News
News November 24, 2024
డిసెంబర్‌లో మోగనున్న పెళ్లి బాజాలు
డిసెంబర్(మార్గశిర)లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెలలో బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. డిసెంబర్ 4, 5, 6, 7, 10, 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఇక జనవరిలో మంచి ముహూర్తాలు లేవు. జనవరి 31 నుంచి మార్చి 4 వరకు మాఘమాసంలో ముహూర్తాలు ఉన్నాయి.
News November 24, 2024
UNSTOPPABLE: జైస్వాల్ 150*
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అదరగొడుతున్నారు. అతడు 275 బంతుల్లో 150* రన్స్ పూర్తి చేసుకున్నారు. ఇందులో 13 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. భారత్ స్కోర్ 288/2.
News November 24, 2024
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. రేపు హస్తినకు వెళ్లనున్న ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అవుతారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ విస్తరణపైనా కసరత్తు చేస్తారని సమాచారం.