News March 27, 2025

సీబీఐలో సంస్కరణలకు పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదనలు

image

CBIలో సంస్కరణలు అవసరమని పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదనలు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల్లో రాష్ట్రాల అనుమతి లేకుండా దర్యాప్తు చేసేలా చట్టం తీసుకురావాలంది. UPSC, SSCలాగా స్వతంత్ర రిక్రూట్‌మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించింది. డిప్యుటేషన్‌పై ఆధారపడకుండా ఉండేందుకు ఈ వ్యవస్థ అవసరమని బ్రిజ్‌లాల్ ప్యానెల్ తెలిపింది. సమయానుకూల, పక్షపాతం లేని దర్యాప్తులకు ఈ మార్పులు అవసరమని పేర్కొంది.

Similar News

News November 17, 2025

‘మైథాలజీ’తో మ్యాజిక్.. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా!

image

పురాణాలు, ఇతిహాసాలను లింక్ చేస్తూ టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. పురాణ పురుషుల కథలతో వచ్చిన కల్కి(మహాభారతం), హనుమాన్(రామాయణం), కార్తికేయ-2(శ్రీకృష్ణుడు), మిరాయ్(అశోకుడు, శ్రీరాముడు) వంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలోని ‘వారణాసి’, చిరంజీవి-వశిష్ట మూవీ ‘విశ్వంభర’ ఈ కోవలోనివే కావడం గమనార్హం.

News November 17, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

image

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్‌కు తెలుస్తుందని తెలిపారు. సూరత్‌లోని రైల్వే కారిడార్‌లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.

News November 17, 2025

ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.