News June 20, 2024
ఐఐటీ బాంబేలో రామాయణానికి పారడీ.. విద్యార్థులకు ఫైన్

రామాయణం ఆధారంగా ఐఐటీ బాంబేలో కొంతమంది విద్యార్థులు వేసిన నాటకం విమర్శలకు దారి తీసింది. మార్చి 31న రాహోవన్ పేరిట చేసిన ఆ నాటకం హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో నాటకం వేసిన వారిలో కొంతమందికి యాజమాన్యం తలా రూ.1.2లక్షల జరిమానా విధించింది. మరికొంతమందికి రూ.40వేలు, జూనియర్ స్టూడెంట్స్‌కు హస్టల్ నిషేధం వంటి శిక్షల్ని విధించింది.
Similar News
News March 29, 2026
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే..

ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
*ఆహారం త్వరగా విచ్ఛిన్నమై జీర్ణక్రియ వేగవంతం అవుతుంది
*క్యాలరీలు త్వరగా కరుగుతాయి. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది
*శరీరంలోని టాక్సిన్స్ (విష పదార్థాలు) బయటకు వెళ్లిపోతాయి
*ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది
*చర్మంపై ముడతలు తగ్గి ఆరోగ్యకరంగా మారుతుంది.
News March 29, 2026
బుద్ధి లేనివాడు ఎలాంటి మాటలు చెబుతాడు?

అల్పుడెపుడుబల్కు నాడంబురముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తక్కువ విలువ ఉండే కంచుకు వచ్చినంత శబ్ధం విలువైన బంగారానికి రాదు. అలాగే తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెబుతూ ఉంటాడు. మంచి ప్రవర్తన గల వ్యక్తి శాంతంగా, సున్నితంగా మాట్లాడతాడు.
<<-se>>#PADHYAM<<>>
News March 29, 2026
‘ఫైర్‌తో ఆడేశాం’.. SRHపై RCB ట్రోల్స్

నిన్నటి SRH vs RCB మ్యాచ్‌తో మళ్లీ IPLలో ఫ్రాంచైజీల మధ్య ట్రోల్స్ సందడి మొదలైంది. ‘ప్లే విత్ ఫైర్’ అని మ్యాచ్‌కు ముందు ఎలివేషన్ ఇచ్చిన SRHను ఓడించడంతో RCB ‘ప్లేయిడ్ విత్ ఫైర్’ అని కౌంటర్ ఇచ్చింది. కోహ్లీ ఛేజింగ్‌ను ఆరెంజ్ జెర్సీలో చూస్తే ఇంకా మజా ఉంటుందని మరో పోస్ట్ పెట్టింది. ఇక కోహ్లీ కొట్టిన ఓ సిక్స్‌కు ‘ఏం షాట్ రా మామా’ అని క్యాప్షన్ పెట్టింది.


