News November 30, 2024
రుణమాఫీ అరకొరగా చేశారు: కిషన్‌రెడ్డి

TG: రాష్ట్రంలో అరకొర రుణమాఫీ చేసి పూర్తిగా మాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తే, వాటినీ తామే భర్తీ చేశామని ప్రచారం చేసుకుంటోందని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లే లేవని ఆయన పేర్కొన్నారు. HYDలో BJP సంఘటన్ పర్వ్ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు.
Similar News
News March 22, 2026
PPPలది సక్సెస్ ఫార్ములా: చంద్రబాబు

AP: దేశంలో పీపీపీ విధానంలో చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు, ఎయిర్ పోర్టులు విజయవంతం అయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం, ఏఐ, డ్రోన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా ప్రణాళికలు రచిస్తున్నామని HYD ISBలో తెలిపారు. వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. భారత్‌లో ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
News March 22, 2026
అస్సాం.. ఏ కూటమిలో ఏ పార్టీ?

అస్సాం ఎన్నికల్లో హాట్రిక్ కొట్టాలని BJP, అధికారమే లక్ష్యంగా INC హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈసారి AGP, UPPL, BPF పార్టీలతో కలిసి బీజేపీ, CPM, AJP, APHLCలతో కలిసి కాంగ్రెస్ బరిలో దిగుతున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా 16 సీట్లు గెలుచుకున్న AIUDF ఒంటరిగా బరిలో దిగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని సీఎం హిమంత, పదేళ్ల పాలనకు ముగింపు పలుకుతామని గౌరవ్ గొగొయ్ ధీమాగా ఉన్నారు.
<<-se>>#Elections2026<<>>