News November 10, 2024

సర్వేలో పాల్గొనండి.. పథకాల్లో కోత ఉండదు: మంత్రి పొన్నం

image

TG: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్‌లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని, సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేటర్లకు ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. ఈ సర్వే తర్వాత సంక్షేమ పథకాల్లో కోత ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.

Similar News

News November 13, 2024

ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు

image

భారత మాజీ క్రికెటర్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ తనను రూ.15కోట్ల మేర మోసం చేశారని JAN 5న రాంచీలో ధోనీ కంప్లైంట్ చేశారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు ఇచ్చింది.

News November 13, 2024

నేడు సభలో కీలక బిల్లులు

image

AP: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగిస్తూ చట్టాల్లో సవరణకు ఒక బిల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లు స్పీకర్ ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సమావేశాలు నవంబర్ 22 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.

News November 13, 2024

నేడు ఝార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్

image

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలిదశలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా స్థానాల్లో కలిపి మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా అందులో కేవలం 73 మంది మాత్రమే మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,37,00,000 మంది ఓటర్ల కోసం 15,344 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.