News October 27, 2024
ఆర్టీసీలో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం: భట్టి

TG: ఈ ఏడాది మహిళలకు రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీలో డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలచే బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. త్వరలోనే వారు బస్సు యజమానులుగా మారతారన్నారు.
Similar News
News January 22, 2026
EU దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు: ట్రంప్

EU దేశాలపై విధించిన టారిఫ్స్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ‘నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో భేటీ అయ్యాను. గ్రీన్లాండ్ సహా ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి ఫ్యూచర్ డీల్ ఫ్రేమ్ వర్క్ రెడీ చేశాం. దీంతో ఒక్క USకే కాదు అన్ని NATO దేశాలకు మంచి జరుగుతుంది. యూరప్ దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించిన గోల్డెన్ డోమ్‌పై మరిన్ని చర్చలు జరుగుతాయి’ అని తెలిపారు.
News January 22, 2026
HYDలో ‘స్విస్ మాల్’ పెట్టండి: CM రేవంత్

స్విట్జర్లాండ్‌లోని వాడ్ కాంటన్ CM క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్‌ను సీఎం రేవంత్ దావోస్‌లో కలిశారు. HYDలో ‘స్విస్ మాల్’ ఏర్పాటు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక బృందాల(SHG) పాత్రను CM వారికి వివరించారు. వాడ్ ప్రతినిధులు త్వరలో TGకు వచ్చి SHG మోడల్‌ను అధ్యయనం చేస్తామని తెలిపారు.
News January 22, 2026
ENE2లో సుశాంత్ చేయట్లేదు: తరుణ్ భాస్కర్

ఈ నగరానికి ఏమైంది రిపీట్(ENE2)లో సాయి సుశాంత్(కార్తిక్) చేయట్లేదని వస్తున్న వార్తలను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కన్ఫామ్ చేశారు. ‘పర్సనల్ రీజన్స్ దృష్ట్యా సుశాంత్ యాక్ట్ చేయట్లేదని తెలిసి బాధ పడ్డాను. సుశాంత్ లేకపోవచ్చు కానీ కార్తిక్ ఉంటాడు. అదే ప్రపంచాన్ని అవే క్యారెక్టర్స్‌ని మీ ముందుకు తీసుకొస్తాం. నా కాస్ట్, క్రూని నమ్ముతున్నాను. మీరు నాపై నమ్మకం ఉంచండి కుర్రాళ్లు ఇరగదీస్తారు’ అని తెలిపారు.


