News March 18, 2024

పార్టీలు వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని తప్పక పాటించి సహకారం అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయా పార్టీల పాలసీల గురించి మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడరాదని స్పష్టం చేశారు.

Similar News

News November 24, 2024

సంతనూతలపాడు ZPHSలో కలెక్టర్ తనిఖీలు

image

సంతనూతలపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పిల్లల్లో అభ్యాస శక్తిని పెంపొందించాలని సూచించారు.

News November 24, 2024

ఒంగోలులో సంబరాలు జరుపుకున్న BJP నేతలు

image

మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా ఒంగోలులో BJP నాయకులు శనివారం రాత్రి బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ముందుగా ఒంగోలులో ర్యాలీ నిర్వహించిన నాయకులు మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చర్చి కూడలి వద్ద బాణసంచాలో కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News November 23, 2024

పెద్దారవీడు మండలంలో వివాదాస్పద ఘటన

image

పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పశువులను మేతకోసం తీసుకువచ్చిన సందర్భంలో.. అటవీశాఖ అధికారులు తమపై దాడి చేశారని పశువుల కాపర్లు ఆరోపించారు. పశువుల కాపరి వెంకటేశ్వర్లును అటవీశాఖ అధికారులు కొట్టడంతో గాయాలయ్యాయని మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అయితే అటవీశాఖ అధికారులు తమపైనే పశువుల కాపర్లు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.