News April 7, 2025
ప్రయాణికురాలి మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ముంబై నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఎయిర్‌పోర్టులో నిన్న రాత్రి 10 గం.కు అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న మీర్జాపూర్‌కు చెందిన మహిళ సుశీల(89)కి అసౌకర్యంగా అనిపించడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. మెడికల్ టీం పరిశీలించి, అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం విమానం వారణాసికి పయనమైంది.
Similar News
News October 23, 2025
జూబ్లీహిల్స్‌లో రౌడీషీటర్‌ను ఓడించండి: KCR

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని BRS చీఫ్ KCR పేర్కొన్నారు. ‘భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించి HYDలో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వసిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. మాగంటి సునీత గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నేతలకు KCR దిశా నిర్దేశం చేశారు.
News October 23, 2025
TET తీర్పుపై సమీక్షకు సుప్రీంలో పిటిషన్: APTF

AP: TETపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ సమీక్ష కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు ఏపీటీఎఫ్ తెలిపింది. ‘2017లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం RTE-2010కి పూర్వం ఉన్న టీచర్లు కూడా TET పాస్ కావాలని సుప్రీం తీర్పిచ్చింది. అయితే అప్పటి టీచర్లకు టెట్‌ను వర్తింపచేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతోంది. 2010కి ముందున్న టీచర్లను దీని నుంచి మినహాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి’ అని విన్నవించింది.
News October 23, 2025
మహిళా శక్తి.. ప్రశంసించాల్సిందే!

నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం సజావుగా నడుస్తోంది. ఈ క్రమంలో ఇంటి పని, ఆఫీస్ ఒత్తిడి, కుటుంబాన్ని చక్కదిద్దే బహుముఖ పాత్రను పోషిస్తున్న మహిళల కృషి అసాధారణమైనది. ఆఫీసు పనితో పాటు ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనా పాలన చూసుకోవడం అంత తేలిక కాదు. ఈ సవాళ్లు అలసట కలిగించినా, తన ప్రేమ, బలం, దృఢ సంకల్పంతో ఆమె అన్నిటినీ సమన్వయం చేస్తోంది. నిజంగా, మహిళే ఆ కుటుంబానికి గుండెకాయ!