News March 2, 2025
పాస్‌పోర్టు రూల్స్ మారాయి.. ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి

పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. 2023 OCT 1న లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనన మరణాల ధ్రువీకరణకు రిజిస్ట్రార్, మున్సిపాల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రం సమర్పించవచ్చని పేర్కొంది. 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వారు DL/టీసీ/ సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన పత్రాన్ని సమర్పించాలని తెలిపింది.
Similar News
News November 11, 2025
భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ జిల్లాలో ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య <<18257519>>ఎదురు కాల్పులు<<>> జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆరుగురు మావోల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
అల్-ఫలాహ్ యూనివర్సిటీ.. లింకులన్నీ ఇక్కడి నుంచే!

ఢిల్లీలో పేలుడు ఘటనతో హరియాణా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ, హాస్పిటల్ వార్తల్లోకెక్కింది. ఇక్కడ 40% డాక్టర్లు కశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు. లోకల్ డాక్టర్లు, విద్యార్థులను కాకుండా ఎక్కువ మంది కశ్మీర్ ప్రాంతానికి చెందినవారిని తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. జైషే మహమ్మద్‌తో సంబంధం ఉన్న ముజామిల్, షాహిన్, నిన్న పేలుడు సమయంలో కారు నడిపిన డాక్టర్ ఉమర్ ఇక్కడి వారే కావడం గమనార్హం.
News November 11, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రూ.202.93 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా ఈ వారం 18,247 మంది లబ్ధిదారులకు నగదు జమ అయినట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, మొత్తం రూ.2,900 కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు.


