News April 9, 2025

ప్రజల వద్దకే పాస్‌పోర్ట్ సేవలు

image

AP: మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇంటివద్దే పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు ‘మొబైల్ వ్యాన్’ను అధికారులు సిద్ధం చేశారు. ఈ వ్యాన్ ఏ రోజు రూట్‌లో ప్రయాణిస్తుందో వెబ్‌సైట్‌లో ఉంచుతారు. దాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకుంటే మీ ప్రాంతంలోనే సర్టిఫికెట్ల పరిశీలన, వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక పోస్టులో పాస్‌పోర్టు పంపుతారు.

Similar News

News April 18, 2025

JEE మెయిన్ ‘కీ’ తొలగించిన NTA

image

JEE మెయిన్ ఫలితాల విడుదల వేళ విద్యార్థులను NTA అయోమయానికి గురి చేస్తోంది. ఇవాళ సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ విడుదల చేసి, కొద్దిసేపటికి దాన్ని తొలగించింది. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇవాళ రిజల్ట్స్ వెల్లడించనున్నట్లు ప్రకటించగా, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై NTAపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

News April 18, 2025

సాక్స్‌లు వేసుకుని పడుకుంటే సుఖమైన నిద్ర!

image

రాత్రి నిద్ర సరిగా పట్టడంలేదని కొందరు, ఎక్కువ సమయం పడుకున్నా సంతృప్తి లేదని మరికొందరు బాధపడుతుంటారు. అయితే సాక్సులు వేసుకుని పడుకోవడం సుఖమైన నిద్రకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పాదాలు వేడెక్కి చర్మం కింది రక్త నాళాలు మిగతా బాడీని కూల్ చేస్తాయంటున్నారు. దాంతో శరీరం నిద్రకు ఉపక్రమిస్తుందంటున్నారు. అయితే ఇన్సోమేనియా వంటి నిద్ర సంబంధిత వ్యాధులున్నవారు ట్రై చేయొద్దని సూచిస్తున్నారు.

News April 18, 2025

డ్రగ్స్ స్కామ్‌లో వైద్యుడికి 130ఏళ్ల జైలు శిక్ష

image

$2.3 మిలియన్ల డ్రగ్స్ స్కామ్‌లో భారత సంతతి వైద్యుడికి అమెరికాలో 130 ఏళ్ల జైలు శిక్ష పడింది. పెన్సుల్వేనియాకు చెందిన ఆనంద్(48) మెడికేర్‌కు తప్పుడు పత్రాలు సమర్పించారని, పేషెంట్లకు నిషేధిత ట్యాబ్లెట్స్ ఇచ్చారన్న అభియోగాలపై విచారణ జరిపి యూఎస్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. 20 వేలకు పైగా ఆక్సికోడోన్ వంటి అడిక్టివ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినట్లు రుజువైందని పేర్కొంది.

error: Content is protected !!