News January 12, 2025
నెహ్రూ కంటే పటేల్, అంబేడ్కర్ PM పదవికి అర్హులు: ఖట్టర్

జవహర్లాల్ నెహ్రూ పొరపాటున దేశ ప్రధాని అయ్యారని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభిప్రాయపడ్డారు. ఆయన కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్ ఆ పదవికి అర్హులని పేర్కొన్నారు. అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ కొనసాగించిందన్నారు. ఖట్టర్ వ్యాఖ్యలను హరియాణా మాజీ సీఎం భూపేందర్ హుడా తిప్పికొట్టారు. పొరపాటున సీఎం అయిన వ్యక్తులు ఇలా మాట్లాడకూడదని చురకలు అంటించారు.
Similar News
News October 16, 2025
ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం బయల్దేరిన మోదీ, CBN, పవన్

AP: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ముగ్గురూ కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. ఆలయం వద్ద 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News October 16, 2025
రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనుంది. నెలవారీ పూజల నిమిత్తం అర్చకులు రేపు గుడి తలుపులు తీసి, దీపాన్ని వెలిగిస్తారని ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. ఈనెల 18న ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా అక్టోబర్ 22న దర్శన సమయాల్లో ఆంక్షలు ఉంటాయంది.
News October 16, 2025
UG&PG విద్యార్థినులకు సైన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం

సైన్స్ రంగంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు L’Oréal India స్కాలర్షిప్ అందిస్తోంది. UG&PG విద్యార్థినులు అర్హులు. ఇంటర్లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి, కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. UGకి రూ.62,500, PG & PhDకి రూ.1,00,000 వరకు స్కాలర్షిప్ అందుతుంది. చివరి తేదీ: 03-11-2025. మరిన్ని వివరాలకు https://www.loreal.com/, https://www.buddy4study.com/ను సంప్రదించవచ్చు.