News December 24, 2024

భారత్‌కు పాత్ పిచ్‌లు, ఆసీస్‌కు కొత్తవి.. క్యూరేటర్ ఏమన్నారంటే?

image

బాక్సింగ్ డే టెస్టుకు IND-AUS సిద్ధమవుతున్న వేళ ఓ వివాదం తెరమీదకు వచ్చింది. MCGలో భారత ప్లేయర్ల ప్రాక్టీస్ కోసం పాత పిచ్‌లు, ఆసీస్ కోసం కొత్త అందుబాటులో ఉంచినట్లు ఫొటోలు వైరలవుతున్నాయి. పాత పిచ్‌ కారణంగా ప్లేయర్లకు గాయాలైనట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై క్యూరేటర్ స్పందిస్తూ ‘మ్యాచ్‌కు 3 రోజుల ముందే కొత్త పిచ్‌ సిద్ధమవుతుంది. IND ప్రాక్టీస్ షెడ్యూల్ చాలా ముందుగా వచ్చింది’ అని పేర్కొన్నాడు.

Similar News

News December 24, 2024

అల్లు అర్జున్‌ను విచారించేది వీరే..

image

TG: అల్లు అర్జున్ కాసేపట్లో తన లీగల్ టీమ్‌తో భేటీ కానున్నారు. అనంతరం ఆ టీమ్‌తోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అల్లు అర్జున్‌కు నిన్న పోలీసులు BNS 35(3) కింద నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్‌ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు ఆయన్ను ప్రశ్నించనున్నారు. తొక్కిసలాట కేసులో బన్నీ A11గా ఉండగా, నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

News December 24, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

TG: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను జనవరి 31లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకు DEOలు, MEOలు, HMలను బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల వివరాల సేకరణకు ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేవలం 3 శాతమే పూర్తయింది. దీంతో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

News December 24, 2024

నో డిటెన్షన్ రద్దు: పేరెంట్స్ మీ అభిప్రాయమేంటి?

image

కేంద్రం 5, 8 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయడం AP, TGలో చర్చనీయాంశంగా మారింది. హాజరు శాతాన్ని బట్టి పై తరగతులకు ప్రమోట్ చేయడం వల్ల విద్యలో నాణ్యత కొరవడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదో క్లాస్ పిల్లలకు రెండో క్లాస్ కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు రావడం లేదన్న వార్తలు గతంలో చాలానే విన్నాం. మరి 5, 8 క్లాసులకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలన్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా?