News April 6, 2025

‘HHVM’కి 5 రోజులు కేటాయించిన పవన్?

image

హరిహర వీరమల్లు సినిమాలో తనకు సంబంధించిన పెండింగ్ సీన్లను పవన్ కళ్యాణ్ వచ్చే వారం కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్‌కు 5 రోజుల్ని కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న ఆయన, అభిమానుల కోరిక మేరకు పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. HHVMతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది.

Similar News

News January 16, 2026

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,43,400 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,31,450కు చేరుకుంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఏకంగా రూ.4,000 తగ్గి రూ.3,06,000 వద్ద కొనసాగుతోంది. కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే విషయమే అయినా ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

News January 16, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 83,619 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 25,712 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, టెక్ మహీంద్రా, M&M, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.313 వద్ద ప్రారంభమైంది.

News January 16, 2026

నేడు ఆవులను ఎలా పూజించాలంటే?

image

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.