News September 28, 2024

పవన్ డిప్యూటీ సీఎం అయింది దీక్షలు చేయడానికేనా?: రామకృష్ణ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ‘పవన్ dy.cm అయింది దీక్షలు చేయడానికేనా? లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ఇప్పటికే సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. అవసరమైతే దీనిపై CM, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారు. పవన్‌కు ఏంటి సంబంధం? భార్య క్రిస్టియన్ అని చెప్పిన ఆయన తిరుమల వెళ్లొచ్చా? దేవుడిని అడ్డం పెట్టుకొని మరొకరిపై విమర్శలు సరికాదు’ అని హితవు పలికారు.

Similar News

News January 6, 2026

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత

image

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈయన రెండుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(1996-2012), ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్(2000-2013) అధ్యక్షుడిగానూ సేవలందించారు.

News January 6, 2026

లోకేశ్‌తో ఐకాన్ స్టార్ సినిమా ఫిక్స్?

image

అల్లు అర్జున్ మరోసారి తమిళ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఆ షూటింగ్ పూర్తవగానే లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రాజెక్టు ప్రారంభమవుతుందని టాలీవుడ్ టాక్. ఇటీవల లోకేశ్ హైదరాబాద్ వచ్చి ఐకాన్ స్టార్‌ను కలిసి మూవీపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నాలుగో చిత్రం కూడా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

News January 6, 2026

గోదావరి పుష్కరాలకు సన్నాహాలు.. ఘాట్‌ల విస్తరణ

image

TG: 2027 గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. భద్రాచలం, మోతెగడ్డ, పర్ణశాల, చినరావిగూడెంలలో భక్తుల రాక కోసం స్నాన ఘాట్‌ల విస్తరణ, ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటు, బారికేడింగ్, వాటర్‌ప్రూఫ్ టెంట్లు, మహిళల కోసం ప్రత్యేక వసతులు ప్లాన్ చేస్తున్నారు. 150 మీటర్ల భద్రాచలం ఘాట్‌ను మరో 150 మీటర్లు పెంచనున్నారు. ఇప్పటికే AP ప్రభుత్వం సైతం పుష్కరాలకు సన్నాహాలు చేస్తోంది.