News March 30, 2024
నేటి నుంచి పవన్ ప్రచారం

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో ‘వారాహి విజయభేరి యాత్ర’ పేరిట ప్రచారం చేయనున్నారు.
Similar News
News October 22, 2025
నవీన్, సునీత నామినేషన్లకు ఆమోదం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నవీన్ యాదవ్, మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. తన నామినేషన్పై బీఆర్ఎస్ తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని నవీన్ తెలిపారు. అన్నీ సక్రమంగా ఉండటంతో ఆర్వో ఆమోదించినట్లు చెప్పారు. తాను మాత్రం ఎవరి నామినేషన్పై అభ్యంతరం చేయలేదని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో స్క్రూటినీకి మరింత సమయం పట్టనుంది.
News October 22, 2025
పట్టణాలు, నగరాల్లో ఇక కామన్ జోనింగ్ విధానం

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జోనింగ్ నిబంధనలు ఒకేమాదిరి కాకుండా వేర్వేరుగా ఉన్నాయి. దీనివల్ల లైసెన్సులు, నిర్మాణ అనుమతులు ఇతర అంశాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని నివారణకు ప్రభుత్వం కామన్ జోనింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తాజాగా <
News October 22, 2025
రానున్న 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు!

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 35-55km/h వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం వరకు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.