News January 6, 2025

పవన్.. నీకు మానవత్వం ఉందా?: రోజా

image

AP: గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి అభిమానులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా పరామర్శించకపోవడం అమానవీయమని వైసీపీ నేత రోజా విమర్శించారు. ‘ రేవతి వ్యవహారంలో ‘పుష్ప 2’ టీమ్ బాధ్యతగా వ్యవహరించలేదని పవన్ అన్నారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటీ? పైగా వారి మరణానికి వైసీపీ రోడ్లు వేయకపోవడమే కారణమని పవన్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

Similar News

News November 28, 2025

టాక్సిక్ వర్క్ కల్చర్‌లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

image

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్‌లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.

News November 28, 2025

అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రికి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని కోరారు.

News November 28, 2025

22 ఏళ్లకే సర్పంచ్.. ఊరిని మార్చేందుకు యువతి ముందడుగు!

image

డిగ్రీ, పీజీ పూర్తయ్యాక పట్టణాలకు వలసెళ్లకుండా ఊరిని బాగుచేయాలి అనుకునే యువతకు 22 ఏళ్ల సాక్షి రావత్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సర్పంచ్‌గా మారి గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని భావించిన సాక్షికి ఊరి ప్రజల తోడు లభించింది. ఉత్తరాఖండ్‌లోని కుయ్‌ గ్రామ ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా గెలిచారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి.. యువ శక్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.