News September 3, 2024

వరద బాధితులకు పవన్ రూ.కోటి విరాళం

image

AP: వరద బాధితులకు dy.CM పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. వరద తీవ్రత, సహాయక చర్యలపై ఆయన రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ‘గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించింది. అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్మీ సహకారంతో బాధితులకు సాయం అందిస్తున్నాం. బుడమేరు నిర్వహణ సక్రమంగా లేక వరద పోటెత్తింది. మరికొంత వరద వచ్చుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

యుద్ధానికి మేము సిద్ధం: పుతిన్

image

గతంలో చెప్పినట్లు యూరప్ దేశాలతో యుద్ధం చేయాలని రష్యా కోరుకోవట్లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఒకవేళ తమపై పోరాటం చేస్తామంటే యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్‌ వార్ ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు ఆమోదయోగ్యంకాని ప్రతిపాదనలు తెచ్చి శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయన్నారు. వాటికి శాంతియుత ఎజెండా లేదని ఆరోపించారు.

News December 3, 2025

డిసెంబర్ 03: చరిత్రలో ఈ రోజు

image

1884: భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ జననం (ఫొటోలో)
1889: స్వాతంత్ర్యోద్యమకారుడు ఖుదీరాం బోస్ జననం
1971: భారత్, పాకిస్థాన్ మూడో యుద్ధం ప్రారంభం
1979: హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ మరణం
2009: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి మరణం
2011: హిందీ నటుడు దేవానంద్ మరణం
* అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

News December 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.