News July 6, 2024
పవన్ ఎఫెక్ట్.. పిఠాపురంలో భారీగా పెరిగిన భూముల ధరలు

AP: డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురంలోని భోగాపురం, ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాలు కొనడంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయట. గతంలో ఎకరం రూ.15-16లక్షలు, NH216కు దగ్గరలో అయితే రూ.50 లక్షల వరకు ఉండేది. పవన్ రాకతో ఇప్పుడు ఎకరం విలువ రూ.కోటి దాటిందని, కొన్నిచోట్ల రూ.2-3 కోట్ల వరకు రేటు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనేందుకు రైతుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.
Similar News
News March 26, 2026
GET READY: 5PMకు టికెట్స్ సేల్

IPL-2026లో భాగంగా ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్స్‌ను SRH యాజమాన్యం ఇవాళ సాయంత్రం 5గంటలకు విడుదల చేయనుంది. District యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ‘SRH’ ట్వీట్ చేసింది. సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఆడే తొలి మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
News March 26, 2026
వీళ్లనూ పట్టించుకోండి బ్రదర్.. గొడవలు వద్దు!

హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల సిబ్బందికి పనిభారం అమాంతం పెరిగింది. విపరీతమైన రద్దీతో క్షణం తీరిక లేకుండా పోయింది. పలు చోట్ల వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయాలని పట్టుబడుతున్నారు. స్టాక్ ఉందని, టెన్షన్ పడొద్దని చెప్పినా వినిపించుకోకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఓ వైపు ఎండ, మరోవైపు ఇలాంటి తలనొప్పితో బంకుల్లో పనిచేసేవారు చుక్కలు చూస్తున్నారు. వారి బాధను అర్థం చేసుకుందాం. వారికి సహకరిద్దాం.
News March 26, 2026
సుప్రీంలీడర్‌గా ఉండమని ఇరాన్ కోరింది: ట్రంప్

ట్రంప్ వంటి వ్యక్తులతో అసలు చర్చలే చేయమని <<19472137>>ఇరాన్<<>> అంటున్న వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంలీడర్‌గా బాధ్యతలు తీసుకోమని ఇరాన్ తనను అనధికారికంగా కోరిందని.. కానీ తనకు అవసరం లేదని ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వీలైనంత త్వరగా డీల్ చేసుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు.


