News June 17, 2024
షూటింగ్ సెట్స్‌లోకి పవన్.. ముందుగా ‘హరిహర వీరమల్లు’

ఎన్నికలు ముగియడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ క్రమంలో కాల్ షీట్స్ ముందుగా ప్రారంభమైన ఈ చిత్రానికే పవన్ కేటాయించారట. జూన్ చివరిలో లేదా జులై మొదటి వారంలో షూటింగ్లో పవర్ స్టార్ పాల్గొననున్నారు.
Similar News
News October 19, 2025
దీపావళి: దీపారాధనకు ఏ నూనె ఉత్తమం?

దీపారాధనకు ఆవు నెయ్యి, నువ్వుల నూనె శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ‘ఆవు నెయ్యి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ నూనె దుష్ఫలితాలు కలగనివ్వకుండా చేస్తుంది. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే దాంపత్యం అన్యోన్యం అవుతుంది. ఆవు నెయ్యిలో వేప నూనె కలిపి వెలిగిస్తే విజయం లభిస్తుంది. అయితే వేరుశెనగ నూనె వాడకూడదు’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
ఎన్నికల రోజు పెయిడ్ హాలిడే ఇవ్వకుంటే జరిమానా: ఈసీ

ఎన్నికలు జరిగే రోజు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే జరిమానా విధిస్తామని యాజమాన్యాలను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఉప ఎన్నికలు జరిగే సెగ్మెంట్లకూ ఇది వర్తిస్తుందని, ఎవరి వేతనాల్లోనూ కోత విధించరాదని సూచించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నా పోలింగ్ రోజు ఈ ప్రయోజనం పొందడానికి అర్హులేనని చెప్పింది. దీనిపై రాష్ట్రాలు ఉత్తర్వులు ఇవ్వాలంది.
News October 19, 2025
ALERT: టపాసులు కాలుస్తున్నారా?

దీపావళి వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం సాధారణమే. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, చర్మ సమస్యలు, అలర్జీస్ ఉన్న పిల్లలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయొద్దని సూచిస్తున్నారు. పొగ, దుమ్ము లంగ్స్పై ప్రభావం చూపుతాయని, సీరియస్ అలర్జిక్ రియాక్షన్స్‌కు దారి తీస్తాయంటున్నారు.