News July 5, 2024

పవన్.. కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయండి: హరి రామజోగయ్య

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కాపు నేత హరి రామజోగయ్య లేఖ రాశారు. ‘మీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నా. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలి. మీరు సినిమాలు, పాలనకు సమానంగా సమయం కేటాయించాలి. జిల్లా, మండల పరిషత్, పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలి’ అని కోరారు.

Similar News

News November 20, 2025

HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్‌ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

News November 20, 2025

బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్‌లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.

News November 20, 2025

ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

image

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.