News March 19, 2024
అసంతృప్తులను బుజ్జగించే పనిలో పవన్

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. దీంతో పాటు పెండింగ్ స్థానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తిరుపతి సీటు వివాదంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.
Similar News
News September 9, 2025
కవిత TDPలోకి వస్తారా? లోకేశ్ ఏమన్నారంటే..

కల్వకుంట్ల కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు నారా లోకేశ్ స్పందించారు. ‘కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిది’ అని వ్యాఖ్యానించారు. తాను KTRను వివిధ సందర్భాల్లో కలిశానని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. NDA అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్‌ను అడగాలని మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.
News September 9, 2025
సియాచిన్‌లో ప్రమాదం.. ముగ్గురు సైనికుల మృతి

లద్దాక్‌లోని సియాచిన్ సెక్టార్ బేస్ క్యాంపులో విషాదం జరిగింది. డ్యూటీలో ఉన్న మహర్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు మంచులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, రెస్క్యూ టీమ్స్ 5 గంటల పాటు కష్టపడి కెప్టెన్‌ను రక్షించాయి. ప్రాణాలు కోల్పోయిన సైనికులు గుజరాత్, యూపీ, ఝార్ఖండ్‌కు చెందిన వారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సియాచిన్ సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.
News September 9, 2025
నేపాల్ తదుపరి PM.. ట్రెండింగ్‌లో బాలేంద్ర షా!

ఓలీ <<17657494>>రాజీనామాతో<<>> నేపాల్ తదుపరి PM ఎవరన్న చర్చ మొదలైంది. కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సివిల్ ఇంజినీర్, ర్యాపర్ అయిన షా 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మేయర్ అయ్యారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ SMలో యాక్టివ్‌గా ఉండే షాకు యువత మద్దతు ఉంది. ఆయన PMగా బాధ్యతలు చేపట్టాలని ఆన్‌లైన్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. కాగా కేవలం కాఠ్‌మాండూలోనే 18 మంది ఆందోళనకారులు మరణించారు.