News September 2, 2025
జన సైన్యానికి ధైర్యం పవన్: సీఎం చంద్రబాబు

AP: పవన్ కళ్యాణ్ మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ‘అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం.. మాటకి కట్టుబడే తత్వం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. స్పందించే హృదయం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 2, 2025
కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి?

ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు కలశంపై కొబ్బరికాయను ఉంచి పూజిస్తారు. ఈ ఆచారాన్ని కలశ స్థాపన అంటారు. పూజ తర్వాత ఆ కొబ్బరికాయను ఓ వస్త్రంలో చుట్టి ఇంట్లోనే కడుతుంటారు. అలా చేయనివారు దాన్ని పారుతున్న నీటిలో/దగ్గర్లోని జలాశయాల్లో నిమజ్జనం చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు. పీఠంపై ఉంచిన బియ్యంతో పాటు కొబ్బరికాయను కూడా బ్రాహ్మణులకు ఇవ్వొచ్చని అంటున్నారు. బ్రాహ్మణులు ఆ కొబ్బరికాయను ‘పూర్ణాహుతి’కి వాడతారు.
News September 2, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అల్వాల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, జనగాం, భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ తెలిపింది.
News September 2, 2025
చరిత్ర లిఖించిన ‘సైయారా’ మూవీ

మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.581కోట్లు(గ్రాస్) రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో భారత సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన లవ్ స్టోరీగా నిలిచినట్లు వెల్లడించారు. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్నట్లు తెలిపారు. భారీ విజయం అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు.