News October 9, 2025

నేడు పవన్, జగన్ పర్యటనలు

image

* AP Dy.CM పవన్ ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. సముద్ర జలాలను పరిశీలించేందుకు బోటులో ప్రయాణించనున్నారు.
*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ మాజీ సీఎం జగన్ ‘చలో నర్సీపట్నం’ పేరిట నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు జగన్ వెళ్లనున్నారు. ఈ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.

Similar News

News October 9, 2025

వచ్చే డీఎస్సీలో 1,803 పీఈటీ, 261 HM పోస్టుల భర్తీ!

image

TG: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు పీఈటీ ఉండాలన్న CM రేవంత్ ఆదేశాలతో అధికారులు చర్యలకు దిగారు. మొత్తం 4,641 హైస్కూళ్లలో 2,800కు పైగా పాఠశాలల్లో పీఈటీలు ఉన్నారు. దీంతో కొత్తగా 1,803 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అటు కొత్త స్కూళ్లలో 261 హెడ్‌మాస్టర్ పోస్టులు భర్తీకి ప్రపోజల్ చేశారు. వీటిని వచ్చే DSCలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

News October 9, 2025

190 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 190 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). పోస్టును బట్టి డిగ్రీ(అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ Eng), CA/CMA, CFMA/MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://punjabandsind.bank.in/

News October 9, 2025

మంచి భార్య రావాలనే వ్రతాలు ఉండవా?

image

మంచి భర్తను పొందడానికి అమ్మాయిలు అనేక వ్రతాలు ఆచరిస్తారు. కానీ సుగుణ సతీమణిని పొందడానికి అబ్బాయిలకు ఏ దివ్యమార్గం లేదా అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. అయితే దీనికి పరిష్కారం ఉందని పండితులు చెబుతున్నారు. మంచి భార్య లభించాలని కోరుకునే పురుషులు దుర్గా దేవిని ప్రార్థించాలని సూచిస్తున్నారు. నిత్యం ‘పత్నీం మనోరమాం దేహి’ అనే మంత్రాన్ని పఠిస్తే.. సద్గుణాలు గల అమ్మాయి ధర్మపత్నిగా వస్తుందని అంటున్నారు.