News April 11, 2024
వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

AP: రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాము కూటమిగా ఏర్పడినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జగన్‌ను ఇక్కడి నుంచి తన్ని తరిమేస్తున్నాం. వాలంటీర్లలో కొందరే తప్పులు చేశారు. కొన్ని పండ్లు చెడిపోతే బుట్టలో మిగతా పండ్లు చెడిపోతాయి. వాలంటీర్లకు అధికారంలోకి రాగానే రూ.10వేలు వేతనం ఇస్తాం. వారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి’ అని పవన్ సూచించారు.
Similar News
News January 6, 2026
ట్యూటర్ నుంచి వ్యాపారం వైపు అడుగులు

సుజాతా అగర్వాల్ హోమ్ సైన్స్‌లో పీజీ చేశారు. పెళ్లి తర్వాత గార్డెనింగ్పై మక్కువతో తొలుత ఇంటి దగ్గరే పూల మొక్కలు పెంచుతూ పిల్లలకు ట్యూషన్ చేప్పేవారు. కరోనాలో ఇంటికే పరిమితం కావడంతో ఇంటర్నెట్లో హైడ్రోపోనిక్స్(మట్టి లేకుండా కేవలం నీటితోనే పంటలు పండించడం) వ్యవసాయ పద్ధతి గురించి తెలుసుకొని, అధ్యయనం చేసి కూరగాయలు పండించాలనుకున్నారు. దానికి అవసరమైన కిట్ కొని దాన్ని ఇంట్లోనే ఒక గదిలో ఏర్పాటు చేశారు.
News January 6, 2026
APPLY NOW: BECILలో ఉద్యోగాలు

బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 12వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI ఉత్తీర్ణులై, పనిఅనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు ₹ 295. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: www.becil.com
News January 6, 2026
నేటి నుంచి మలేషియా ఓపెన్

గత ఏడాది నిరాశపరిచిన భారత షట్లర్లు కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. నేటి నుంచి జరిగే మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక, ఉన్నతీ హుడా, డబుల్స్‌లో పుల్లెల గాయత్రీ-ట్రీసా జాలీ, మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ పోటీ పడనున్నారు. అక్టోబర్ తర్వాత సింధు ఆడుతున్న టోర్నీ ఇదే కావడంతో ఆమె ఎలా రాణిస్తారో చూడాలి.


