News July 9, 2024

పవన్ కళ్యాణ్ ఓఎస్‌డీగా వెంకటకృష్ణ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్‌డీగా వెంకటకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జీఏడీలో అడిషనల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఓఎస్‌డీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News

News December 6, 2025

ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్‌కు రావాలని ఆదేశం

image

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.

News December 6, 2025

కాలాలకు అతీతం ఈ మహానటి

image

తెలుగువారికి మహానటి అనగానే గుర్తొచ్చే పేరు సావిత్రి. చక్కటి అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు. తెలుగు, తమిళ భాషల్లో 84 చిత్రాల్లో నటించిన ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. నటనతో, మానవత్వంతో ఎందరికో స్పూర్తినింపిన ఆమె నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. నేడు మహానటి సావిత్రి జయంతి.

News December 6, 2025

డికాక్ సెంచరీ.. 2 వికెట్లు తీసిన ప్రసిద్ధ్

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న చివరి వన్డేలో దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ సెంచరీ చేశారు. 80 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. వన్డేల్లో డికాక్‌కు ఇది 23వ సెంచరీ. మరోవైపు తన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులిచ్చిన భారత బౌలర్ ప్రసిద్ధ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచులో గెలిచిన జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోనుంది.