News August 31, 2025

అల్లు అరవింద్, బన్నీని ఓదార్చిన పవన్ కళ్యాణ్

image

దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి ఆయనతో పాటు అల్లు అర్జున్‌ను ఓదార్చారు. ఇతర కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. వృద్ధాప్య సమస్యలతో కనకరత్నం (94) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Similar News

News September 1, 2025

మరో 24 గంటల్లో అల్పపీడనం: APSDMA

image

AP: ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని APSDMA తెలిపింది. మరో 24 గంటల్లో ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు విజయనగరం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.

News September 1, 2025

పంట నష్టంపై నివేదిక ఇవ్వండి: CM రేవంత్

image

TG: గత ఏడాది పంట నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై సీఎం రేవంత్ అధికారులను ఆరా తీశారు. ఇటీవల వరదలతో ఏర్పడ్డ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. NDRFతో పనిలేకుండా SDRF సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాలని సూచించారు. రోడ్ల డ్యామేజ్‌పైనా సమగ్ర నివేదిక రూపొందించడంతో పాటు HMDA పరిధిలోని చెరువులను వెంటనే నోటిఫై చేయాలన్నారు.

News September 1, 2025

CBI విచారణపై సస్పెన్స్!

image

తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న ‘కాళేశ్వరం ప్రాజెక్టు CBI విచారణ’ అంశంపై కేంద్ర నిర్ణయం ఆసక్తికరంగా మారింది. PC ఘోష్ కమిషన్ రిపోర్టులో BJP MP, BRS ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పేరూ ఉంది. దీంతో సొంత నేతపై ఆరోపణలున్న కేసు దర్యాప్తుకు అప్పగిస్తే సెల్ఫ్ గోల్ అవుతుందా? వెయిట్ చేస్తే కాంగ్రెస్ విమర్శలతో ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? తదితర అంశాలు లెక్కలేసుకున్నాకే నిర్ణయం తీసుకోనుంది.