News November 5, 2024
సరస్వతి పవర్ భూములు పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్

AP: పల్నాడు జిల్లా మాచవరంలో సరస్వతి పవర్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు పవన్ వద్ద వాపోయారు. ‘అప్పట్లో తక్కువ ధరకే భూములు లాక్కున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా కంపెనీ పెట్టలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ సంస్థకు ఇచ్చిన లీజును రద్దు చేయాలి. లేదంటే పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించాలి’ అని వారు డిమాండ్ చేశారు.
Similar News
News October 30, 2025
కాలుష్యం కాటుతో ఇండియాలో 17 లక్షల మంది మృతి

పెట్రోల్, డీజిల్ వంటి వినియోగంతో వెలువడుతున్న కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 2022లో 25 లక్షల మంది బలైనట్లు ‘ది లాన్సెట్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఒక్క ఇండియాలోనే 17 లక్షల మంది మరణించినట్లు వివరించింది. 2010తో పోలిస్తే మరణాలు 38% పెరిగినట్లు పేర్కొంది. ఈ ఇంధన వాడకం 2016 కన్నా 21% పెరిగిందని తేల్చింది. ఢిల్లీ వంటి చోట్ల కాలుష్యం స్థాయులు పెరుగుతుండడంతో ఈ రిపోర్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
News October 30, 2025
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

సైనిక్ స్కూళ్లలో 6వ, 9వ తరగతిలో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఇవాళ్టితో ముగియనున్న గడువును నవంబర్ 9వ తేదీ వరకు పెంచారు. ఫీజు చెల్లింపునకు నవంబర్ 10 వరకు, తప్పుల సవరణకు 12-14 తేదీల్లో అవకాశం కల్పించారు. అర్హత పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది.
News October 30, 2025
రాహుల్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ఓట్ల కోసం మోదీ <<18140008>>డాన్స్<<>> కూడా చేస్తారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై BJP తీవ్రంగా స్పందించింది. బిహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. ‘రాహుల్‌వి అత్యంత అవమానకర, అసభ్య వ్యాఖ్యలు. అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. PM వ్యక్తిత్వంపై దాడి చేయడమే’ అని మండిపడింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని, రాహుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.


