News June 21, 2024

పవన్ కళ్యాణ్ పేషీలోకి డైనమిక్ ఆఫీసర్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలోని త్రిసూర్(D) కలెక్టర్‌ కృష్ణతేజ రానున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ చూపించాలనుకుంటున్న పవన్ ఏరికోరి ఆయనను నియమించుకుంటున్నారు. కృష్ణతేజను డిప్యుటేషన్‌పై పంపాలని CBN కేంద్రానికి లేఖ రాశారు. 2015 బ్యాచ్‌కి చెందిన కృష్ణతేజది పల్నాడు(D) చిలకలూరిపేట. కేరళలో పర్యాటకాభివృద్ధి, అలప్పుజ కలెక్టర్‌గా అద్భుత పనితీరుతో కేంద్ర అవార్డులు పొందారు.

Similar News

News January 19, 2025

IIT బాబాను ఆశ్రమం నుంచి పంపించేశారు!

image

మహాకుంభమేళాకు వచ్చిన IIT బాబా (అభయ్ సింగ్) SMలో వైరలైన విషయం తెలిసిందే. అయితే తాను ఉంటున్న ఆశ్రమం నుంచి పంపించేశారని ఆయన మీడియాతో తెలిపారు. ఆశ్రమ గురువు మహంత్ సోమేశ్వర్ పూరీని దూషించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘అర్ధరాత్రి నిర్వాహకులు వెళ్లిపోవాలన్నారు. తనకు మతిస్థిమితం లేదన్నారు. అక్కడ నాకంటే మానసిక స్థితి తెలిసిన సైకాలజిస్టులు ఉన్నారా? నాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి’ అంటూ అభయ్ మండిపడ్డారు.

News January 19, 2025

రాజకీయాల్లోకి ‘కట్టప్ప’ కూతురు

image

ప్రముఖ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. ఆమె తమిళనాడులో ప్రముఖ పోషకాహార నిపుణులు (న్యూట్రిషనిస్ట్)గా గుర్తింపు పొందారు. కాగా సత్యరాజ్ బాహుబలి, బాహుబలి-2 సినిమాల్లో కట్టప్పగా నటించి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

News January 19, 2025

WEIGHT LOSS: 145kgs నుంచి 75kgలకు!

image

అజర్ హాసన్ అనే యువకుడు నాలుగేళ్లలో 70 కేజీల బరువు తగ్గి ఫిట్‌నెస్ మోడల్‌గా మారాడు. ఇందులో 55KGS 7 నెలల్లోనే తగ్గినట్లు చెప్పారు. అతడి బాడీ ఫ్యాట్ 55% నుంచి 9%కి తగ్గింది. సరైన శిక్షణ, కఠోర శ్రమ, బ్యాలన్స్‌డ్ డైట్‌తో ఇది సాధ్యమైందన్నారు. తన తండ్రి మృతదేహాన్ని సమాధిలో పెట్టేటప్పుడు ఊబకాయం వల్ల కిందికి వంగలేకపోయానని, ఆ తర్వాత శ్రమించి బరువు తగ్గినట్లు MTV రోడీస్ షోలో అజర్ తెలిపారు.