News March 30, 2024

పవన్‌ కళ్యాణ్‌కు వర్మ తల్లి ఆశీర్వాదం

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. దొంతమూరులోని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఇంట్లో ఆయన భోజన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వర్మ తల్లి అలివేలు మంగ పద్మావతి ఆశీస్సులు తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. తనకు సంపూర్ణ మద్దతు పలకాలని ఆయన కోరారు. సుమారు గంటసేపు వర్మతో ముచ్చటించారు.

Similar News

News February 9, 2026

మంత్రులకు సీఎం CBN క్లాస్!

image

AP: రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై రివ్యూ సందర్భంగా CM చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘మంత్రులంటే కేవలం పాలసీలు చేసేవాళ్లు కాదు. జనాభా పెరుగుదలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. గర్భనిరోధక ఆపరేషన్లు తగ్గించాలి. పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై అసెంబ్లీలో పాలసీ ప్రకటిస్తాం. జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలిస్తాం. APR 1 నుంచి పాలసీ ప్రణాళిక రూపొందిస్తాం’ అని చెప్పినట్లు సమాచారం.

News February 9, 2026

ఇటలీపై స్కాట్లాండ్ ఘన విజయం

image

T20WCలో భాగంగా ఇటలీతో జరిగిన <<19091297>>మ్యాచ్‌లో<<>> స్కాట్లాండ్ 73 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇటలీ 16.4 ఓవర్లలో 134 స్కోరుకే ఆలౌటైంది. బెన్ మనేంటి(52), హ్యారీ మనేంటి(37), జేజే స్మట్స్(22) మినహా అందరూ విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ 4, మార్క్ 2, బ్రాడ్ కుర్రీ, వీల్, ఒలీవర్ తలో వికెట్ తీశారు.

News February 9, 2026

సోషల్ మీడియాలో ‘Vagueposting’.. అసలేంటిది?

image

గతవారం Vagueposting గ్లోబల్ గూగుల్ ట్రెండులోకి రావడంతో దీనిగురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. సమయం, సందర్భం, సరైన వివరాలు, అర్థం లేకుండా బాధ, సంతోషం, కోపాన్ని వ్యక్తపరుస్తూ SMలో చేసే పోస్టులనే Vagueposting అంటారు. యూజర్లను గందరగోళంలో పడేసి వారి అటెన్షన్‌ను పొందేందుకు ఇలా చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి పోస్టులు కనిపిస్తే స్కిప్ చేయండి. దీనిగురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.