News August 21, 2025

శ్రీశైలం ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్

image

AP: శ్రీశైలం ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. ‘తాము తప్పు చేసినా ఉపేక్షించొద్దని చంద్రబాబు, నేను అసెంబ్లీలో స్పష్టం చేశాం. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణను ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News August 21, 2025

సిబిల్ స్కోర్ లేకపోతే నో జాబ్.. కేంద్రం క్లారిటీ

image

IBPS సెలక్షన్ ప్రక్రియలో అభ్యర్థులు సిబిల్ స్కోర్ పొందుపరచాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. కానీ బ్యాంకులో ఉద్యోగంలో చేరే సమయంలో క్రెడిట్ స్కోర్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సిబిల్ రికార్డు అప్డేటెడ్‌గా లేకుంటే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి NOC తీసుకోవాలని సూచించారు. ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని బ్యాంకులు కోరుకుంటున్నట్లు తెలిపారు.

News August 21, 2025

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి పయనమవుతారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలతో రేవంత్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News August 21, 2025

నేడు మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రూ.904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ఆమోదం పలకనుందని సమాచారం. కొత్త జిల్లాల పేర్లు మార్పు, ఏర్పాటుపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.