News October 10, 2024

పవన్ కళ్యాణ్‌కు మరోసారి అస్వస్థత

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూనే వారాహి సభలో పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

మేడారం పనుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి: CM

image

TG: మేడారం అభివృద్ధి పనులు నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘అభివృద్ధి పనుల్లో ఆచార‌ సంప్ర‌దాయాలు, నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి. పొర‌పాట్లు దొర్లితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. రాతి ప‌నులు, ర‌హ‌దారులు, గ‌ద్దెల చుట్టూ రాక‌పోక‌ల‌కు మార్గాలు, భ‌క్తులు వేచి చూసే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి అంశంపై CM అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.

News December 1, 2025

సజ్జ రైతులకు దక్కని మద్దతు ధర

image

AP: సజ్జలను పండించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అక్టోబరులో మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట నాణ్యత, దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775గా ఉంటే.. నాణ్యత సరిగా లేదని రూ.1800 కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జలను సాగు చేశారు.

News December 1, 2025

గంభీర్‌.. రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు?

image

టీమ్ఇండియా కోచ్ గంభీర్, స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. ‘గంభీర్-రోహిత్, కోహ్లీ మధ్య బంధాలు అంత బాగా లేవు. ఇద్దరు ప్లేయర్ల భవిష్యత్తుపై విశాఖ లేదా రాయ్‌పూర్‌లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది’ అని జాతీయ మీడియా తెలిపింది. టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే వివాదాలు మొదలైనట్లు పేర్కొంది. రోహిత్, సెలక్టర్ అగార్కర్ మధ్య కూడా సంబంధాలు సరిగా లేవని చెప్పింది.