News August 8, 2024

బెంగళూరు బయల్దేరిన పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో సమావేశం కానున్నారు. కర్ణాటకలోని ఆరు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మంత్రిని పవన్ కోరనున్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్‌ కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. కాగా ఏపీలోని చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో ఏనుగుల గుంపును తరమడానికి కుంకీ ఏనుగులు అవసరం.

Similar News

News January 17, 2026

కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- జాగ్రత్తలు

image

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్‌లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్‌కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.

News January 17, 2026

బెంగాల్‌లో మార్పు కావాలి.. బీజేపీ రావాలి: మోదీ

image

TMC అంటే అవినీతి, హింస, బుజ్జగింపు రాజకీయాలనే విషయం బయటపడిందని PM మోదీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటోందని, కేంద్ర సాయం ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. బెంగాల్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం BJP ప్రభుత్వం రావాలన్నారు. బిహార్‌లో NDA గెలుపు తర్వాత ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చిందని మాల్డా సభలో అన్నారు. ‘మార్పు కావాలి.. బీజేపీ రావాలి’ అని PM కొత్త నినాదమిచ్చారు.

News January 17, 2026

రిపబ్లిక్ డే వేడుకలకు ఉగ్ర ముప్పు!

image

రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్ర సంస్థలు టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఖలిస్థానీ, బంగ్లా టెర్రర్ సంస్థలు దాడులకు ప్లాన్ చేసినట్లు వెల్లడించాయి. హరియాణా, పంజాబ్, ఢిల్లీ-NCR, UP, రాజస్థాన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాదులతో లింక్ ఉన్న గ్యాంగ్‌స్టర్లు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాయి. గతేడాది ఢిల్లీలో <<18265346>>కారు పేలుడు<<>> నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి.