News December 2, 2024

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి పవన్ వచ్చారు. వీరి భేటీలో రాజ్యసభ సీట్ల సర్దుబాటు, బియ్యం అక్రమ రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Similar News

News February 5, 2026

లొద్ద జలపాతం ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్

image

సాలూరు మండలం లొద్ద జలపాతం ప్రారంభం ఏర్పాట్లను పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. కాగా ఇప్పటికే జలపాతం వద్ద ఆర్చితో పాటు రహదారి, పర్యాటకులు సేద తీరడానికి విశ్రాంత బల్లలు, డ్రస్ చేంజింగ్ రూమ్స్, దుకాణాలను సిద్ధం చేశారు. సౌకర్యాలు సమకూర్చడంలో ఎటువంటి లోపాలు ఉండరాదని అధికారులకు సూచించారు.

News February 5, 2026

సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యత.. ఎంపీ ప్రశ్నకు సమాధానం

image

దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ వెల్లడించారు. సోలార్ విద్యుత్ ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై బుధవారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రమంత్రి వివరాలు వెల్లడించారు.

News February 5, 2026

VZM: ‘భూ హక్కుదారునికే పాస్‌పుస్తకాలు ఇవ్వాలి’

image

భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాస్‌పుస్తకాల పంపిణీ, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలపై ఆయన సమీక్షించారు. ప్రతి నెలా 9వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలని, ఈ-కేవైసీ అనంతరం తప్పులేని పాస్‌పుస్తకాలు ఇవ్వాలని సూచించారు.